అక్టోబర్ 1 నుండి రేషన్ షాపులు బంద్

5
- Advertisement -

అక్టోబర్ 1వ తేదీ నుండి తెలంగాణ వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ కానున్నాయి. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని పౌర సరఫరా శాఖకు సమ్మె నోటీసులు ఇచ్చారు రేషన్ డీలర్లు.

వచ్చే నెల 1వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేయనున్నట్టు ప్రకటించాయి రేషన్ డీలర్ల సంఘాలు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ నిధులు విడుదల చేయడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టారు.

వెంటనే నిధులు విడుదల చేయకపోతే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తూ పౌర సరఫరా శాఖకు సమ్మె నోటీసులు ఇచ్చారు రేషన్ డీలర్లు.

Also Read:అమెరికాలో మళ్లీ టిక్‌టాక్‌..!

- Advertisement -