ఆసియా కప్ 2025లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేయాలని తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాపై మాజీ పాకిస్తాన్ పేసర్ షోయబ్ అఖ్తర్ తీవ్రంగా మండిపడ్డారు. దుబాయ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సల్మాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం పాకిస్తాన్ జట్టుకి పెద్ద దెబ్బతీసింది. భారత స్పిన్నర్ల దాడికి పాకిస్తాన్ బ్యాటర్లు తట్టుకోలేకపోయారు. 20 ఓవర్లలో 9 వికెట్లకు కేవలం 127 పరుగులు మాత్రమే చేశారు. సాహిబ్జాదా ఫర్హాన్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం భారత్ 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఏడు వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది.
భారత్ స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీశారు. భారత్ బ్యాటింగ్‌లో మూడు వికెట్లు కోల్పోయినా, అవన్నీ పాకిస్తాన్ స్పిన్నర్ సైమ్ అయూబ్ ఖాతాలో పడాయి.టోర్నమెంట్ ఆరంభం నుంచి దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటున్నప్పటికీ, సల్మాన్ బ్యాటింగ్ ఎంచుకోవడంపై అఖ్తర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూర్యకుమార్ యాదవ్ టాస్‌లోనే పిచ్ రిపోర్ట్ చెప్పేశాడు. నీ మన ఐన్‌స్టీన్ మాత్రం ‘ముందు బ్యాటింగ్ చేద్దాం’ అన్నాడు అని పాక్ కెప్టెన్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్తాలు సంధించారు. నిరాశ కలిగించే నిర్ణయం ఇది. భారత్‌కు హ్యాట్స్ ఆఫ్. దీనిని రాజకీయంగా మలచకండి. ఇది కేవలం క్రికెట్ మ్యాచ్. మేము మీ గురించి మంచి మాటలే చెప్పాం. ఇంకా చాలా చెప్పగలము కానీ అవసరం లేదు. ఇంట్లోనూ గొడవలు జరుగుతాయి. మరచిపోండి, ముందుకు సాగండి అని సూచించారు.
Also Read:రైల్వే రిజర్వేషన్‌లో కీలక మార్పులు

