తుఫాను..నిత్యావసర సరుకుల పంపిణీ

5
- Advertisement -

ఏపీలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. మొంథా తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు నిత్యావసర సరకుల పంపిణీ నిమిత్తం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తుఫాన్ ప్రభావిత కుటుంబాలు, మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, ఒక లీటర్ నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో చక్కెర పంపిణీకి ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే సరఫరా చర్యలు ప్రారంభించాలని సివిల్ సప్లైస్ కమిషనర్ ఆదేశించారు.

తుఫాన్ సమయంలో ప్రజలెవరూ బయటకు రావొద్దు అని ఏపీ మంత్రి నారా లోకేశ్ సూచించారు. ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించాలి… రోడ్లపై పడిన చెట్లను వెంటనే తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు అన్నారు. తుఫానుపై క్షేత్రస్థాయిలో అధికారులంతా సిద్ధంగా ఉన్నారు అని తెలిపారు లోకేశ్.

Also Read:BB9:ఈ వారం నామినేషన్స్‌లో!

- Advertisement -