విపత్తుల సమయంలో మానవత్వం ఉన్న ఎవరైనా ప్రజలకు సాయం చేస్తారు అన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. కానీ జగన్ మాత్రం ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తూ.. విష రాజకీయాలు చేస్తున్నారు అని దుయ్యబట్టారు.
బెంగళూరు ప్యాలెస్ లో సేదతీరుతూ.. అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి పునరావాస కేంద్రంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది అన్నారు. వదంతులు నమ్మొద్దు.. ఇది ప్రజల ప్రభుత్వం… అత్యవసర సాయానికి టోల్ ఫ్రీ నెంబర్ 18004250101 ఏర్పాటు చేసినట్లు తెలిపారు లోకేష్.
ఇక తుఫాన్ సమయంలో ప్రజలెవరూ బయటకు రావొద్దు అని… ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించాలి అన్నారు. రోడ్లపై పడిన చెట్లను వెంటనే తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు… తుఫానుపై క్షేత్రస్థాయిలో అధికారులంతా సిద్ధంగా ఉన్నారు అన్నారు.
Also Read:రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి

