‘మైసా’…‘ఓ మైసా రే’

4
- Advertisement -

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని ఫియర్స్ అవతార్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మైసా’లో పవర్ ఫుల్ అవాతర్ లో కనిపించనున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. భారీ విజన్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పోస్టర్లకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ అంచనాలను మరింత పెంచుతూ మేకర్స్ ఈ రోజు సినిమా నుంచి తొలి పాట ‘ఓ మైసా రే’ ను విడుదల చేశారు.

జేక్స్ బిజోయ్ అందించిన ఇంటెన్స్, పవర్‌ఫుల్ మ్యూజిక్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఉరుముల్లాంటి బీట్స్‌తో సాగే ఈ పాట ఆద్యంతం అదే టెంపో, ఎనర్జీని కొనసాగిస్తూ ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తోంది. సుద్దాల అశోక్ తేజ రాసిన సాహిత్యం మైసాను ఈషి, ఐషి రూపాల్లో ఆవిష్కరిస్తూ దైవిక స్త్రీ శక్తిని, అర్ధనారీశ్వర స్వరూపాన్ని ప్రతిబింబిస్తోంది. మహిళల శక్తి సామర్థ్యాలను కీర్తిస్తూ, ధైర్యంగా నిలబడి యుద్ధానికి సిద్ధం కావాలనే స్ఫూర్తిని ఈ పాటలోని పదాలు బలంగా చాటుతున్నాయి.

Also Read:రాహుల్ కోసమే RR ట్యాక్స్:అమిత్ షా

అటవీ నేపధ్యం, భారీ సంఖ్యలో డ్యాన్సర్లతో రూపొందించిన ఈ పాట ప్రేక్షకులకు అడ్రినలిన్ పెంచే అనుభూతిని అందిస్తోంది. విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో పాట ప్రభావం మరింత పెరిగింది. ‘ఓ మైసా రే’ మ్యూజిక్ చార్ట్స్‌లో సంచలనం సృష్టించేందుకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమాకు ప్రతిభావంతులైన సాంకేతిక బృందం పనిచేస్తోంది. శ్రేయాస్ పి. కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా ఈ చిత్రంలోని స్టంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు.‘మైసా’ నవంబర్ 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -