రేటు పెంచిన రష్మిక…ఎంతో తెలుసా…?

517
rashmika
- Advertisement -

ఛలో సినిమాలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలతో టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది రష్మీక మందన. తన అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోన్న రష్మిక ముఖ్యంగా యూత్‌లో యమ క్రేజ్ సంపాదించేసింది. విజయ్‌ దేవరకొండతో గీతా గోవిందం మూవీలో రష్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ భామ చేతిలో అరడజనుకు పైగా సినిమాలుండగా వీటిలో మహేష్‌, నితిన్‌ మూవీలున్నాయి.

సక్సెస్ ఉండగానే తన కెరీర్‌ని గాడిలో పెట్టుకోవాలని భావించిందో ఏమోగాని రెమ్యూనరేషన్‌ని అమాంతంగా పెంచేసిందట ఈ భామ. మొదట్లో రూ.40 లక్షలు పారితోషికాన్ని పుచ్చుకున్న రష్మిక ఇప్పుడు ఏకంగా రూ.80 లక్షలకు పెంచేసిందనే టాక్‌ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

తెలుగు,తమిళ్‌తో పోలీస్తే కన్నడ చిత్రాల బడ్జెట్‌ తక్కువగానే ఉంటుంది. అక్కడ కూడా సినిమాకు రూ. 60 లక్షలు డిమాండ్ చేస్తోందట రష్మిక. దీంతో శాండల్‌వుడ్‌ నిర్మాతలు షాకవుతున్నారట. అంతేగాదు తన రెమ్యునరేషన్‌ పెంచడంపై అంతే ఘాటుగా స్పందిస్తోందట.నటిగా ఇప్పుడు తన స్థాయి పెరిగిందని, అందుకు తగ్గట్టుగా పారితోషకాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు నిర్మొహమాటంగా నిర్మాతలకు చెబుతోందట. మొత్తంగా ప్రస్తుతం వరుస సినిమాలతో ఇండస్ట్రీ టాక్‌గా మారింది రష్మిక.

- Advertisement -