తమిళ స్టార్ హీరోతో రష్మిక రొమాన్స్‌..!

626
- Advertisement -

కన్నడ బ్యూటీ రష్మిక మందన వరుస సినిమాలతో క్రేజీ స్టార్ల సరసన నటిస్తూ దూసుకుపోతోంది.ఈ బ్యూటీ ఇటీవలే సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నితిన్‌తో భీష్మలో నటించింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్ట్స్‌ మూవీ ఏఏ20 లోనూ రష్మికనే హీరోయిన్ అని తెలుస్తోంది. అయితే టాలీవుడ్‌లో పలు చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక తమిళ్‌లో కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది.

surya and rashmika

తమిళ స్టార్ హీరో సూర్య ‘సింగం’సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వంలో నటించనున్నాడు. ఇందులో సూర్యకు జోడీగా రష్మిక నటించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. కాగా ఇప్పటికే సూర్య తమ్ముడు కార్తీ నటిస్తోన్న ‘సుల్తాన్’ మూవీలో నటిస్తోన్న ఈ అమ్మడు. ఇప్పుడు సూర్యతో రొమాన్స్‌ చేయనుంది. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న ఈ బ్యూటీ మరి కోలీవుడ్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

- Advertisement -