విజయ్ దేవరకొండతో ఎఫైర్ లేదట !

137
- Advertisement -

హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన్నాతో రిలేషన్‌లో ఉన్నారని గత కొంతకాలం నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై ఓ తమిళ మీడియాతో రష్మిక మందన్నా స్పందించింది. విజయ్ దేవరకొండ తో నేను ఐదేళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాను. దాంతో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. విజయ్ దేవరకొండ తో నాది ఫ్యామిలీ ఫ్రెండ్ షిప్ అని, అందుకే విజయ్ దేవరకొండ ఇంటికి నేను, మా ఇంటికి విజయ్ దేవరకొండ వస్తూపోతుంటాం. దానితో మా మధ్యన ఎఫైర్ ఉందని ప్రచారం జరిగింది.

అయితే ఎప్పుడూ నేను ఆ విషయాన్నీ సీరియస్ గా తీసుకోలేదని రష్మిక మందన్నా చెప్పింది. అలాగే రష్మిక మందన్నా ఇంకా మాట్లాడుతూ.. అందరూ అనుకున్నట్టుగా మా మధ్యన అక్రమ సంబంధం లాంటిది లేదని.. మేమెప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని.. తమపై వచ్చే రూమర్లని.. బాధగా కాకుండా కాంప్లిమెంట్ గా భావించేవాళ్లమని.. విజయ్ దేవరకొండ, నేను కూడా ఈ రూమర్స్ ని ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదని రష్మిక మందన్నా చెప్పింది. అసలు తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని.. దయచేసి ఇలాంటి పుకార్లు క్రియేట్ చేయొద్దు ఆమె రిక్వెస్ట్ చేసింది. అయితే, విజయ్ దేవరకొండ తో రష్మిక మందన్నా అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు గతంలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు పై మాత్రం రష్మిక మందన్నా స్పందించలేదు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -