రష్మీక 60రోజులు చేసిందట..

544
Rashmika-Mandanna
- Advertisement -

ఛలో మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రష్మీక మందన..ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం సినిమాలో నటించిన టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె పలవురు స్టార్ హీరోయిన్ల సరసన నటిస్తుంది. మహేశ్ బాబు తో సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో భీష్మలో నటిస్తుంది. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటించిన సినిమా డియర్ కామ్రేడ్ విడదలకు సిద్దంగా ఉంది. వరుసగా రెండో సారి విజయ్ సినిమాలో నటించి ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే ఈసినిమాలో రష్మీక తన డబ్బింగ్ తానే చెప్పిందట. తన పాత్రకి వెరోకరు డబ్బింగ్ చెబితే సరిగ్గా రాదేమో అని దర్శకుడిని ఒప్పించి మరి డబ్బింగ్ చెప్పాను అని తెలిపింది. కానీ ఆమెకు ఈసినిమా డబ్బింగ్ పూర్తి చేయడానికి 60రోజులు పట్టిందట. తెలుగు సరిగ్గా రకపోవడంతోనే అంత టైం పట్టిందని చెప్పుకోచ్చింది రష్మీక మందన.

ఇక ఈసినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో ఏకకాలంలో విడుదలవుతుంది. జులై 26న ఈసినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. భతర్ కమ్మ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ నిర్మించింది. ఈమూవీ ట్రైలర్ , పాటలకు మంచి రెస్పాస్ రావడంతో భారీ అంచానాలు నెలకొన్నాయి.

- Advertisement -