విజ‌‌య్ తో ర‌ష్మీక మంద‌న రొమాన్స్..

260
rashmika
- Advertisement -

ఛ‌లో సినిమాతో తెలు‌గు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ర‌ష్మ‌క మందన వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తుంది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన అతికొద్ది స‌మ‌యంలోనే స్టార్ హీరోల స‌ర‌స‌న వ‌రుస‌గా సినిమాలు చేస్తుంది. ఇటివలే మ‌హేశ్ బాబుతో స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో న‌టించ‌గా..ప్ర‌స్తుతం అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌బోయే మూవీలో న‌టిస్తుంది. ఇక త‌మిళ్ లో కూడా ర‌ష్మ‌క హ‌వా కొన‌సాగుతుంది. త‌మిళ్ స్టార్ ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ విజ‌య్ ద‌ళ‌ప‌తి కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది.

ఈమూవీలో హీరోయిన్ గా ర‌ష్మ‌క మంద‌న‌ను తీసుకున్న‌ట్లు స‌మాచారం.మ‌రికొద్ది రోజుల్లోనే చిత్ర‌యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. త్వర‌లోనే ఈమూవీ రెగ్యూల‌ర్ షూటింగ్ ప్రారంభ‌కానున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు ర‌ష్మిక న‌టించిన సినిమాలు అన్ని మంచి విజ‌యం సాధించ‌డంతో ఆమెకు తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌లో స్టార్ హిరోల‌తో న‌టించే అవ‌కాశాన్ని కొట్టేసింది. తెలుగులో ఇటివ‌లే నితిన్ సర‌‌స‌న భీష్మ మూవీలో న‌టించింది. ఈమూవీ భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్ట‌డంతో పాటు నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

- Advertisement -