సినిమా రేటింగ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థ ఐఎమ్‌డీబీ. తాజాగా ఈ సంస్థ విడుదల చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్ జాబితాలోకి శాండల్‌వుడ్ నటి రష్మిక మందన్నా చేరారు. బాలీవుడ్ నటులను కాదని టాప్ 3వ స్థానంలో నిలిచింది. టాలీవుడ్ లోని పుష్ప ద్వారా దేశవ్యాప్తంగా ఇమేజ్ పెంచుకున్న తర్వాత విడుదలైన ఈ ర్యాంకింగ్‌లో ఫిట్ సాధించింది. ప్రస్తుతం పుష్ప-2 యొక్క హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌మీడియాలో ట్రెండింగ్ హవా కొనసాగుతుంది. దీంతో పాటుగా iamRashmika అనే హ్యాష్ ట్యాగ్ నడుస్తోంది.
ప్రస్తుతం రష్మిక పుష్ప-2తో పాటుగా రెయిన్‌బో అనే సినిమా కోసం పనిచేస్తుంది. అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌తో కలిసి మరో సినిమాలో నటిస్తోంది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలో కూడా మెప్పిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్‌తో కలిసి సందీప్ వంగా దర్శకత్వంలో యానిమల్ సినిమాలో నటిస్తోంది ఈ అమ్మడు.
ఇవి కూడా చదవండి…