కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన రష్మిక!

3
- Advertisement -

సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలనం సృష్టించారు హీరోయిన్ రష్మిక మందన్న. ఇటీవల జరిగిన ఆమె పెళ్లి ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 25 మిలియన్ల లైక్స్ సాధించి చరిత్ర సృష్టించాయి. ఈ ఘనతతో భారత్‌లో అత్యధిక లైక్స్ పొందిన ఇన్‌స్టా పోస్ట్‌గా రికార్డు నెలకొల్పింది.

ఇంతకుముందు ఈ రికార్డు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ విజయం అనంతరం కోహ్లీ షేర్ చేసిన పోస్ట్‌కు 22.9 మిలియన్ల లైక్స్ రావడంతో అది దేశంలో అత్యధిక లైక్స్ సాధించిన పోస్ట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు రష్మిక ఆ రికార్డును అధిగమించి కొత్త మైలురాయిని అందుకున్నారు.

రష్మిక పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు భారీగా స్పందించారు. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ రికార్డుతో మరోసారి స్పష్టమైంది.

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సినిమా సెలబ్రిటీల ప్రభావం ఎంత ఉందో రష్మిక తాజా రికార్డు నిరూపించింది. అభిమానుల ప్రేమతో ఆమె పేరు ఇప్పుడు సోషల్ మీడియా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది.

Also Read:హైదరాబాద్‌ని కుప్పకూల్చింది రేవంత్ రెడ్డే:కేటీఆర్

- Advertisement -