ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే మన రష్మీ మళ్ళీ ఒకరికి ముక్కున వేలేసుకునేలా సమాధానం చెప్పి అందరి చేత “ఔరా..!” అనిపించుకుంటోంది. ఇటీవల విడుదలైన “అంతకుమించి” సినిమా లో తన గ్లామర్ తో యూత్ ని మంత్రముగ్ధుల్ని చేసిన రష్మీ సోషల్ మీడియాలో విచిత్రమైన కామెంట్లను ఎదుర్కొంటుంది. కొందరు అద్భుతంగా చేసావ్ అని ప్రశంసిస్తుంటే కొందరు ఇలాంటివి ఇక చేయొద్దని సలహాలిస్తున్నారు. ఆలా ఓ నెటిజన్ ఇచ్చిన సలహాకు అవాక్కయ్యే ఆన్సర్ ఇచ్చింది రష్మీ.
“నువ్వు దర్శకులు తెచ్చే సినిమాల కోసం ఎదురుచూడకుండా సొంత సినిమాలు చెయ్యి ” అంటూ ఆ నెటిజన్ ఇచ్చిన సలహాకు, “దాందేముంది ..అలాగే చేస్తాను..నా బ్యాంకు అకౌంట్ వివరాలు నీకు పంపుతాను..3 కోట్లు పంపితే గొప్ప సహాయం చేసిన వాడివి అవుతావ్ ” అంటూ సమాధానమిచ్చింది రష్మీ. ఏది ఏమైనా అంతకు మించి సినిమా ఫలితం ఎలా ఉన్నాగాని రష్మీ గ్లామర్ కి ఉన్న క్రేజ్ వల్లే సినిమా తీరం చేరిందని విశ్లేషకులు చెప్తున్నారు.