టాలీవుడ్‌లో ‘కాస్టింగ్ కౌచ్’ అంటూ చెలరేగిన వివాదం అంతా ఇంతా కాదు. అవకాశాల పేరుతో మహిళలను వేదిస్తున్నారని, తెలుగు హీరోయిన్‌లకు సరైన అవకాశాలు కల్పించడం లేదనే ప్రశ్నలు వినిపించాయి. ఈ వివాదంతో తెలుగు పరిశ్రమలో ఒక యుద్ద వాతావరణం కనిపించినట్లైంది. ఇది కాక శ్రీరెడ్డి ఫిలీం ఛాంబర్ వద్ద అర్థనగ్న ప్రదర్శనతో సంచలనం సృష్టించడంతో పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయో తెలియని పరిస్థితులు కనిపించాయి.
ఈ వివాదం రాను రాను వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్‌లో కొన్ని రోజులు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ‘కాస్టింగ్ కౌచ్’పై ఇప్పటికే చాలా మంది నటీ నటులు స్పందించారు. కొందరు మద్దతిచ్చినప్పటికి మరికొందరు సర్దుకొచ్చారు. తాజాగా ఇదే అంశంపై ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది నటీ, యాంకర్ రష్మీ.
ఈ విధంగా స్పందిస్తూ…‘‘మహిళలపై లైంగిక వేధింపులు అన్నిరంగాల్లో విస్తరించాయని, కేవలం సినిమా పరిశ్రమనే లక్ష్యంగా చేసుకొని ఈ అంశాన్ని మరింత పెద్దదిగా చేయొద్దని తెలిపారు. కాస్టింగ్ కౌచ్ అంటూ కేవలం సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయకుండా ఇక ఇప్పటితో ఈ వివాదానికి స్వస్తి పలికి ఇలాంటి ఆలోచనలు మానుకోండి’’ అని ట్వీట్ చేసింది.