ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. కలెక్షన్స్ పరంగా ఇప్పటికే 200 కోట్ల బాక్స్ ఆఫీస్‌ని క్రాస్ చేసిన ఆ సినిమా మహేష్ కెరీర్ లోనే మంచి చిత్రంగా నిలిచింది. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని కూడా చిత్ర యూనిట్ ఏ మాత్రం ఆపడం లేదు. సినిమాకు సంబంధించిన ఎదో ఒక విషయాన్ని ఇంకా జనాల హృదయాల్లో మెదిలేలా చేస్తోంది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను సత్తా చాటింది. ఇక తమిళనాట తెలుగు వెర్షన్ కూడా మంచి వసూళ్లను సాధించింది. చెన్నైలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా ఇది నిలిచింది.
అయితే ఇప్పుడు ఈ సినిమాను తమిళంలోకి అనువదించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం అందుకు అవసరమైన డబ్బింగ్ పనులను మొదలెట్టేశారు. తమిళ వెర్షన్ ను అక్కడ ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే ప్రకటించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో, మహేశ్ బాబు జోడీగా కైరా అద్వాని నటించిన సంగతి తెలిసిందే. తమిళ వెర్షన్ కు ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందనేది చూడాలి.
#BharatAneNenu the @urstrulyMahesh Telugu super hit has been dubbed into Tamil as #BharathEnumNaan. First look poster. Release Soon! @sivakoratala @DVVEnts pic.twitter.com/sZYlKKx0FO
— Sreedhar Pillai (@sri50) May 11, 2018

