హెచ్‌సీయూలో జరుగుతున్న ఘటనపై స్పందించింది యాంకర్ రష్మీ. నేను రాజకీయాల కోసం ఈ వీడియో చేయటం లేదు.. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిపై వ్యతిరేకంగా కూడా ఈ వీడియో నేను చేయటం లేదు, ఎక్కడ నేను వ్యతిరేకం కూడా కాదు అన్నారు. Hcu జరుగుతున్న ఘటన అందరికీ తెలుసు.. నేనున్న ఈ అపార్ట్మెంట్లో కూర్చుని పోస్ట్ చేస్తున్నాను గతంలో ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని పక్షులు ఎన్ని జంతువులు ఎన్ని చెట్లు తొలగింపబడ్డాయో నాకు కూడా తెలుసు అన్నారు.
ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుసు.. అక్కడ జరుగుతున్న అభివృద్ధి చూస్తే పక్షులు నెమళ్ళు చాలా సఫర్ అవుతున్నాయి అన్నారు. రాబోయేది అత్యంత వేసవికాలం అందులో పక్షులు నెమళ్లు జంతువులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది.. వారి ఇంటి నుంచి వాటిని తరిమేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం ఆలోచించాలి అన్నారు.
జంతువులను రీహబిలైట్ చేయాలి.. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అన్నారు. పాజిటివ్ స్టెప్స్ తో మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటున్నారని ఆశిస్తున్నాను అని ఎక్స్ వేదికగా వీడియో రిలీజ్ చేశారు రష్మీ.
Please rehabilitate those animals that land has been home to them
Humble request #SaveHCUBioDiversity pic.twitter.com/B2Qm5pDIGy— rashmi gautam (@rashmigautam27) April 1, 2025
Also Read:ఢిల్లీలో బీసీ సంఘాల మహాధర్నా..

