రష్మీ.. చాలా కాలం నుంచినే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, జబర్దస్త్ తో ఈమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ టీవీ షోతో దక్కిన గుర్తింపుతో సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. ‘గుంటూర్ టాకీస్’సినిమాలో రేష్మీ గ్లామర్ షో సంచలనంగా నిలిచింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి కారణాల్లో ఒకటిగా నిలిచింది. తాజాగా ‘నెక్స్ట్ నువ్వే’ సినిమాలోనూ ఆమె హాట్ లుక్స్ ఆకట్టుకున్నాయి.
ఐతే ఈ సినిమాలో రష్మి చెప్పిన ఓ డైలాగ్ చర్చనీయాంశమైంది. ‘‘నీకు గడ్డివాము దగ్గర కుక్క గురించి తెలుసా.. అది తినదు.. వేరే వాళ్లను తిననివ్వదు’’ అంటుంది రష్మి ఈ సినిమాలో. ట్రైలర్లోనే చర్చనీయాంవమైన ఈ డైలాగ్ సినిమా విడుదలయ్యాక మరింతగా హాట్ టాపిక్ అయింది. రష్మి ఈ డైలాగ్ చెప్పే తీరు.. ఆ సీన్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై రష్మి స్పందించింది. ఈ డైలాగ్లో అశ్లీలత ఏముంది. నేనేం ఆ డైలాగ్ కోసం అర్ధనగ్న డ్రస్సులు కూడా వేయలేదుగా. ఎందుకు ఇంత వివాదం చేస్తున్నారు. డైలాగ్కే ఇలా వివాదం చేస్తున్నారు, అంతకంటే ఎక్కువే ఈ మధ్య సినిమాల్లో చూపిస్తున్నారు. ఈ డైలాగ్పై వివాదం చేయాల్సినంత అవసరం ఏమీ లేదు…” అంటూ రష్మీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.