‘బొమ్మ బ్లాక్ బస్టర్’..‌ రష్మీ న్యూ లుక్..

111
anchor rashmi

టాలీవుడ్ న‌టులు నందు, రష్మీ గౌతమ్‌ జంటగా రాజ్‌ విరాఠ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇటీవ‌ల‌ విడుదలైంది. ఇందులో హీరో నందు పోతురాజుగా, దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ఫ్యాన్‌గా కనపడతాడని ఆ సినిమా యూనిట్‌ ప్రకటించింది.

తాజాగా, పోతురాజు గాడి ల‌వర్ వాణి అంటూ ర‌ష్మీ గౌత‌మ్ లుక్ ను ఆ సినీ యూనిట్ విడుద‌ల చేసింది. త‌ల‌పై కిరీటం పెట్టుకుని చిరున‌వ్వులు చిందిస్తూ క‌న‌ప‌డుతున్న ర‌ష్మీ లుక్ అభిమానుల‌ను ఆక‌ర్షిస్తోంది. కాగా, విజయూభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాజ్ విరాఠ్ దర్శకత్వం వహిస్తున్నారు.