- Advertisement -
ఐపీఎల్-11 సీజన్ లో అద్భుతమైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్శించిన సన్ రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్ ను పలువురు ప్రముఖులు ప్రశంసించిన సంగతి తెలిసిందే. అయితే రషీద్ ఖాన్ ఆటతీరుపై సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్ గురించి తాజాగా ఓ ఇంటర్వూలో రషీద్ మాట్లాడుతూ… సచిన్ తనను పొగుడూ ట్వీట్ చేయడంతో మొదట ఆశ్చర్యపోయానని చెప్పాడు.
తాను బస్సులో వెళ్తుండగా తన మిత్రుడు నుంచి ఒక మెసేజ్ వచ్చిందని, అందులో సచిన్ నా గురించి ట్వీట్ చేసిన స్క్రీన్ షాట్ పిక్ ఉందని, నా గురించి సచిన్ గొప్ప ఆటగాడు అని ట్వీట్ చేయడంతో ఎలా స్పందించాలో తెలియక రెండు మూడు గంటల పాటు ఏ రిప్లై ఇవ్వలేదని, కొద్ది సేపటి తర్వాత రిప్లై ఇచ్చానని చెప్పుకొచ్చాడు.
- Advertisement -