భారత పౌరసత్వంపై రషీద్ ఖాన్

4
- Advertisement -

అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, తాను రాసిన ‘రషీద్ ఖాన్: ఫ్రమ్ స్ట్రీట్స్ టు స్టార్‌డమ్’ (Rashid Khan: From Streets to Stardom) అనే పుస్తకంలో భారత్ మరియు ఆస్ట్రేలియా పౌరసత్వం గురించి సంచలన విషయాలను వెల్లడించారు.

ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న రషీద్ ఖాన్, తన పుస్తకంలో గతంలో తనకు వచ్చిన పౌరసత్వ ఆఫర్ల గురించి ప్రస్తావించారు. అఫ్గానిస్థాన్ క్రికెట్‌ పట్ల తనకున్న నిబద్ధతను ఆయన ఈ సందర్భంగా చాటిచెప్పారు.

ఐపీఎల్ 2023లో ప్రతిపాదన: 2023 ఐపీఎల్ సమయంలో ఒక సీనియర్ బీసీసీఐ (BCCI) అధికారి తనను కలిసి, “అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు బాలేవు. మీరు భారత్‌కు వచ్చేయండి.. మీకు భారత పౌరసత్వం, పత్రాలు ఇస్తాం. ఇక్కడే ఉండి క్రికెట్ ఆడండి” అని కోరినట్లు రషీద్ తన పుస్తకంలో రాశారు.

ఆ ప్రతిపాదనకు ఆశ్చర్యపోయిన రషీద్, సున్నితంగా తిరస్కరించారు. “నేను నా దేశం (అఫ్గానిస్థాన్) తరపున ఆడకపోతే, ఇంకే దేశం తరపున కూడా ఆడను” అని స్పష్టం చేశారు. “ధన్యవాదాలు, కానీ నేను నా దేశం కోసమే ఆడతాను” అని ఆయన నవ్వుతూ బదులిచ్చారు.

Also Read:సిక్స్‌లు ఎలా కొట్టాలో ప్రాక్టీస్ చేయను!

కేవలం భారత్ నుంచే కాకుండా, ఆస్ట్రేలియా నుంచి కూడా తనకు ఇలాంటి పౌరసత్వ ప్రతిపాదనలు వచ్చాయని ఆయన వెల్లడించారు. అయితే ఆస్ట్రేలియా ఆఫర్ గురించి ఎక్కువ వివరాలను ఆయన పుస్తకంలో పేర్కొనలేదు. ప్రస్తుత సీజన్లో రషీద్ ఖాన్ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చారు. గుజరాత్ టైటాన్స్ తరపున అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తూ, ఇప్పటివరకు 20 ఓవర్లలో కేవలం 154 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టారు. రషీద్ రాసిన ఈ పుస్తకం త్వరలోనే విడుదల కానుంది.

- Advertisement -