- Advertisement -
ఊహలు గుసగుసలాడే చిత్రంలో తన నటనతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అందాలను రాశి పోసి పేర్చినట్లుండే రాశి ఖన్నా టాలీవుడ్ ని ఏలేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది.
ఇటీవలె కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. చిన్నప్పటి నుంచి నాకు ఐఏఎస్ అధికారి కావాలని ఉండేది. కానీ నటిగా మారిపోయా. నా చిన్ననాటి కోరిక తీరదని తెలుసు. కానీ నేను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేసింది.
ప్రజల కోసం సేవ చేస్తా…. అంతకంటే ముందు ఎన్జీవో సంస్థను మొదలు పెడతా. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటా. రాజకీయం ఎలా చేయాలో నాకు తెలియదు. కానీ ప్రజలకు ఎలా సాయం చేయాలో మాత్రం నాకు చాలా బాగా తెలుసని చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా.
- Advertisement -