హైదరాబాద్ జలవిహార్‌లో హిమాచాల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మీ ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధూం ధాం ఆట పాటలతో అలరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయలక్ష్మి తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అలయ్ బలాయ్ ఒక చోదకశక్తిగా పని చేసిందన్నారు. రాజకీయంగా వెరైన్ వ్యక్తులను కూడా ఒక వేదికపైకి తెచ్చింది అలయ్ బలాయ్ అన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై దంపతులకు పట్టువస్త్రాలు సమర్పించారు దత్తాత్రేయ దంపతులు.
గవర్నర్ తమకు సమయం ఇవ్వటం లేదంటూ వేదికపై అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత వీహెచ్. గత గవర్నర్ కూడా తమ పట్ల ఇలానే వ్యవహరించారని..పాత గవర్నర్ లా చేయొద్దని కోరారు వీహెచ్. ఫ్లెక్సీల్లో కాంగ్రెస్ నాయకుల ఫోటోలు లేకపోవటం బాధాకరం…. తెలంగాణ ఇచ్చిన సోనియాను అవమానించారని…హిమాచల్ గవర్నర్ తమను జరచూసుకోవాలంటూ దత్తాత్రేయను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఈ అలమ్ – బలాయ్ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి , మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు కేకే , రేవంత్ రెడ్డి , మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ , డిజిపి మహేందర్ రెడ్డి , ఎమ్మెల్యేలు దానం నాగేందర్ , రాజాసింగ్ , ముఠా గోపాల్ , రసమయి బాలకిషన్ , మేయర్ బొంతు రామ్మోహన్ , బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ , మురళీధర్ రావు , బిసి కమిషన్ చైర్మన్ రాములు , వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు హాజరయ్యారు…..