ప్రముఖ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ర్యాపిడో (Rapido) ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెడుతూ తన నూతన యాప్ “ఓన్లీ” (Ownly) సేవలను బెంగళూరు తర్వాత ఇప్పుడు భాగ్యనగరమైన హైదరాబాద్‌కు విస్తరించింది. స్విగ్గీ, జొమాటో వంటి దిగ్గజ సంస్థలకు పోటీగా, వినియోగదారులు మరియు రెస్టారెంట్ యజమానులకు లాభదాయకంగా ఉండే ప్రత్యేకమైన వ్యూహంతో ర్యాపిడో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
సాధారణంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లు రెస్టారెంట్ల నుంచి 20% నుండి 30% వరకు కమిషన్ వసూలు చేస్తాయి. దీనివల్ల హోటల్ యజమానులు ఆన్‌లైన్ మెనూ ధరలను పెంచాల్సి వస్తుంది. అయితే ఓన్లీ ప్లాట్‌ఫామ్ పూర్తి భిన్నమైన విధానాన్ని అమలు చేస్తోంది.హోటళ్లు లేదా రెస్టారెంట్ల నుండి ఎలాంటి కమిషన్ వసూలు చేయరు. దీనివల్ల ఆఫ్‌లైన్ (హోటల్) ధరలకే ఆన్‌లైన్‌లో ఆహారం లభిస్తుంది.
Also Read:‘కాకా’ డబ్బింగ్ ప్రారంభం
()ప్లాట్‌ఫామ్ ఫీజులు , ప్యాకేజింగ్ ఛార్జీలు, లేదా సర్జ్ ఛార్జీల పేరిట వినియోగదారులపై అదనపు భారం వేయరు.
()వినియోగదారులు కేవలం వారు ఆర్డర్ చేసిన ఆహారానికి, అలాగే డెలివరీ ఛార్జీకి మాత్రమే చెల్లిస్తారు.
నగరంలోని ఫుడ్ లవర్స్, ముఖ్యంగా బిర్యానీ ప్రియులు తక్కువ ధరలకే నచ్చిన వంటకాలను ఆర్డర్ చేసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. ప్లేస్టోర్, యాప్ స్టోర్‌లలో ‘Ownly’ పేరుతో ప్రత్యేక యాప్ అందుబాటులో ఉండటంతో పాటు, సాధారణ ర్యాపిడో యాప్ ద్వారా కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.మరోవైపు, ఇప్పటికే ఉన్న ర్యాపిడో బైక్ టాక్సీ డ్రైవర్లకు (కెప్టెన్లకు) ఈ ఫుడ్ డెలివరీ సేవలు అదనపు రాబడి మార్గాన్ని అందిస్తున్నాయి. ప్రయాణికులను చేరవేయడంతో పాటు ఖాళీ సమయంలో ఫుడ్ డెలివరీలు చేయడం ద్వారా వారు మరింత ఆదాయాన్ని పొందే అవకాశం ఏర్పడింది.

