కరోనా టెస్టులకు సింగరేణి సంసిద్ధం

293
sccl
- Advertisement -

సింగరేణి ప్రాంతాల్లో కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం పలు చర్యలను చేపట్టింది. ఈ విషయాలను హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్ ల తో మంగళవారం నాడు నిర్వహించిన వీడియో సమావేశంలో సంస్థ డైరెక్టర్లు వివరించారు.

డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ పా శ్రీ ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ ఎం బలరాం లు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కరోనా వ్యాధి సోకిన వారికి తక్షణం వైద్య సహాయం అందించడానికిసంస్థ చైర్మన్ &ఎం. డి శ్రీ ఎన్. శ్రీధర్ ఆదేశం పై తీసుకున్న పలు చర్యలను ఏరియా జనరల్ మేనేజర్ లకు వివరించారు .అలాగే పలు సూచనలు చేశారు .

సింగరేణి ఏరియా ల లో ర్యాపిడ్ టెస్టుల నిర్వహణ కోసం సంస్థ 5000 కిట్లను కొనుగోలు చేసింది . వీటిని గురువారం నాటికి ఏరియా ఆస్పత్రులకు సరఫరా చేయనున్నారు .వీటి రాకతో సింగరేణి ప్రాంతంలో వెనువెంటనే కరోనా పరీక్షలు నిర్వహించే వీలు కలగనుంది.అలాగే హైదరాబాదులోని మరో మూడు వెంటిలేటర్ సౌకర్యం గలసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ల తో అత్యవసర సేవల కోసం ఒప్పందం కుదుర్చుకుంది .

సింగరేణి ప్రాంతాలలో సీరియస్ కేసులను ఈ ఆసుపత్రులకు యాజమాన్యం తరలిస్తుంది. కాబట్టి కరోనా సోకిన అత్యవసర కేసులకు ఆసుపత్రుల కొరత అనేది ఉండదు. ఇంతే కాకుండా హిటేరో కంపెనీ తయారుచేసిన కరోనా వ్యాధి నివారణకు ఉపయోగించే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్లు 1800దోసులను కూడా కంపెనీ కొనుగోలు చేసింది. వీటిని గురువారం నాటికి అన్ని ఏరియా ఆస్పత్రులకు సమకూర్చుతున్నారు.

కాగా సింగరేణి ఏరియా ఆసుపత్రి లతోపాటు క్వారంటినే సెంటర్లలోవైద్య సిబ్బంది కి సహాయపడటానికి అవసరమైన వారిని తక్షణమే సమకూర్చుకోవాలని ఏరియా యాజమాన్యాలను డైరెక్టర్లు కోరారు .కరోనా వైద్య సేవల్లో ఉన్న వైద్య సిబ్బందికి నెల జీతం పై పది శాతం అదనంగా కరోనా అలవెన్స్ చెల్లిస్తున్నమని ,కాగా కరోనా సేవల్లోపనిచేసే అవుట్సోర్సింగ్ వారికి రోజుకు వారి జీవితం పై మూడు వందల రూపాయలు అదనంగా చెల్లించడం జరుగుతుందని డైరెక్టర్లు పేర్కొన్నారు.

అన్ని ఏరియాల్లోకరొన వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో వైద్య సిబ్బంది వారి సహాయకులకు ఎటువంటి భయం లేకుండా పని చేయటానికి వారిలో స్ఫూర్తి నింపాలని డైరెక్టర్లు కోరారు. అన్ని ఏరియాల్లో క్వరంటయిన సెంటర్లను పూర్తి సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిఎం కోఆర్డినేషన్ శ్రీ రవిశంకర్ , చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంతా శ్రీనివాస్ రెసిడెంట్ డాక్టర్ శ్రీ శివకుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
.

- Advertisement -