గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఇంజనీరింగ్ విద్యార్థులు..

266
green challenge
- Advertisement -

వీళ్ళు సెలబ్రిటీలు కారు , రాజకీయ నాయకులు కారు , ప్రముఖుల జాబితాలో లేరు , కానీ వేల మంది స్వంచందంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు.

నాగోల్ లోని పల్లవి ఇంజనీరింగ్ కళాశాల , ప్రకృతి ప్రేమికులు , పర్యావరణ పరిరక్షకులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్ఫూర్తిగా తీసుకొని ,ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా 28.7.2020 న వర్చువల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహించింది.

మన భూమికి నీరు, చెట్లు, నేల వంటి అపరిమితమైన వస్తువులు లేనందున ప్రకృతి వనరులను పరిరక్షించడానికి ఉత్తమమైన పద్ధతుల గురించి అవగాహన కల్పించడానికి ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం అంతర్జాతీయంగా గుర్తించబడింది.

COVID 19 మరియు సామాజిక దూరం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ, పల్లవి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మరియు సిబ్బంది హరితహరం కి మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బి.టెక్ మరియు డిప్లొమా సిబ్బంది మరియు విద్యార్థులు తమ నివాస ప్రాంతాలలో మొక్కలను నాటి హరితహారం లో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహించారు. పల్లవి విద్య సంస్థల చైర్మన్ శ్రీ మాల్కా కోమరయ్య మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణ మనందరి సామజిక బాధ్యతని అన్నారు.ఈ కార్యక్రమాన్ని పల్లవి ఇంజనీరింగ్ కళాశాల నేచర్ క్లబ్ మరియు నేషనల్ గ్రీన్ కార్ప్స్ చాప్టర్ నిర్వహించాయి.

- Advertisement -