పైసామే_పరమాత్మ. మనిషులు ఎంత స్వార్థపరులయ్యారో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. సోషల్ మీడియా ఒకే ఒక్కరోజులో ఆమెను స్టార్‌గా మార్చేసింది. చింపిరిజుట్టు , ఆకలితో అలమటిస్తున్న ఓ మహిళా పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంతకీ ఆమె ఎవరా అని ఆరాతీయగా కోల్‌కతాకు చెందిన రాణు మోండాల్‌గా గుర్తించారు. ఆమె వస్త్రధారణ, ఆమెను చూస్తే ఎవరూ నమ్మలేదు కానీ ఇప్పుడు రాణు పాటలు యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయంటే అతిశయోక్తికాదు. రాణు మోండాల్ ప్రతిభను గుర్తించిన బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా తన మూవీ ‘హ్యాపీ హార్డీ అండ్ హీర్’లో పాట పాడించే అవకాశం కల్పించాడు.
దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె కోల్‌కత గానకోకిలగా మారిపోయింది. ఇదంతా ప్రస్తుతం..కానీ ఆమె గతం చూస్తే కన్నీళ్లు పెట్టకమానరు. అయినవాళ్లు కాదనుకున్నారు. అంతేందుకు తన కన్నకూతురే వికారంగా ఉందని ఆమెను ఇంట్లో నుండి గెంటేసింది.దీంతో గత్యంతరం లేక పొట్టకూటికోసం పాటలు పాడుతు జీవనం గడుపుతోంది. ఇలా ఆమె పాటలు పాడితే బిస్కెట్లు ఇచ్చేవారు కొందరైతే మరికొంతమంది అన్నం పెట్టేవాళ్లు.
సోనీ ఛానెల్ నుండి పిలుపు రావడంతో రాత్రి రాత్రికి స్టార్ అయ్యింది.ఏ కూతురైతే తల్లి ముసలిదైంది అని ఇంట్లో నుండి గెంటేసిందో ఆమే వచ్చి మొఖాన నవ్వు పులుముకోని తల్లిని హత్తుకుంది. డబ్బుంటే ఏదైన సాధ్యమే అనే సంఘటన రాణు మోండాల్‌ను చూస్తే మరోసారి అర్ధమవుతుంది.