ప్రభాస్ నా కులంః రామ్ గోపాల్ వర్మ

738
Ram Gopal Varma, Prabhas
- Advertisement -

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హీరో ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్వీట్టర్ వేదికగా వర్మ మరోసారి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు సంబంధించి టైటిల్ సాంగ్ ను కూడా విడుదల చేశారు. తాజాగా ప్రభాస్ నా కులం అంటూ వర్మ వాయిస్ తో ఓ వీడియో ను విడుదల చేశారు.

నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. అందుకనే రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా కోసం కళ్ళు వాచిపోయేలా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ప్రభాస్ నా క్యాస్ట్ కాబట్టి. ఈసందర్భంగా నా నెక్ట్స్ సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలోని ఒక పాటని 27వ తారీఖు ఉదయం 9గంటల 27నిముషాలకి బ్రహ్మ ముహుర్తంలో రిలీజ్ చేయబోతున్నాం అంటూ వర్మ వాయిస్ తో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

వర్మ చేసిన పోస్ట్ పై ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. మరోవైపు టాలీవుడ్ లో తనకు నచ్చే ఎకైక హీరో ప్రభాస్ అని వర్మ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అంతలోనే ప్రభాస్ కులం గురించి ఇలా వర్మ మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -