- Advertisement -
హైదరాబాద్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్ లో బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారీ ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టాడు. మనోజ్ తివారీ (414 బంతుల్లో 303 నాటౌట్; 30 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత ప్రదర్శనతో తొలి ఇన్నింగ్స్‌ను బెంగాల్ 7 వికెట్లకు 635 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అతని ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో ఇది 27వ సెంచరీ కాగా, తొలి ‘ట్రిపుల్’ కావడం విశేషం. మనోజ్ తివారీ భారత జట్టు తరపున 12 వన్డేలు, మూడు టీ20 లు ఆడాడు. చివరిసారిగా జింబాబ్వేలో మన దేశం తరఫున ఆడాడు.
ఇక బెంగాల్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జవీద్ అలీ 19 పరుగులతో, తన్మయ్ అగర్వాల్ 10 పరుగులతో ఆడుతున్నారు. బెంగాల్ జట్టు కంటే హైదరాబాద్ ఇంకా 552 పరుగులు వెనకబడి ఉంది.
- Advertisement -