రంగస్థలం.. దుమ్ములేపుతున్న కొత్త ట్రైలర్‌..

317
Rangasthalam New Trailer
- Advertisement -

అప్పట్లో పది సినిమాల్లో ఏడెనిమిది పల్లెటూరి కథలతోనే తెరకెక్కేవి. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రచయితలు.. దర్శకులు అర్బన్ స్టోరీల మీదే దృష్టిపెట్టారు. క్రమంగా అవే తెలుగు సినిమాను కమ్మేశాయి. పల్లెటూరి కథలకు అసలు చోటే లేకుండా పోయింది. ఐతే సరిగ్గా తీయాలే కానీ.. విలేజ్ సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల్ని అలరిస్తాయని.. అద్భుతమైన ఫలితాలను అందిస్తాయని అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు రుజువు చేస్తూనే ఉన్నాయి. ఇందుకు తాజా రుజువు.. ‘రంగస్థలం’. ఈ చిత్రం ఏ స్థాయి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Rangasthalam New Trailer

గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌ప్ప‌టికి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌ని అందుకున్న చిత్రం రంగ‌స్థ‌లం. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత హీరోహీరోయిన్స్‌గా న‌టించారు. మార్చి 30న విడుద‌లైన ఈ చిత్రం రికార్డు క‌లెక్ష‌న్స్ సాధించే దిశ‌గా అడుగులు వేస్తుంది. జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాశ్ రాజు, ఆది పినిశెట్టి, అన‌సూయ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు.

Rangasthalam New Trailer

అయితే ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ అయిన కార‌ణంగా ప్రేక్ష‌కుల‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపేందుకు రంగ‌స్థ‌లం మేకర్స్ విజ‌యోత్సవ వేడుక నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. సినిమా రిలీజ్‌కి ముందు ట్రైల‌ర్ విడుద‌ల చేసి మూవీపై భారీ అంచ‌నాలు పెంచిన టీం, రిలీజ్ అయి ఇంత పెద్ద విజ‌యం సాధించిన త‌ర్వాత కూడా ఓ ట్రైల‌ర్ విడుద‌ల చేసింది. మూడు నిమిషాల న‌ల‌భై సెక‌న్ల ఈ వీడియో సినీ ల‌వ‌ర్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం, చంద్ర బోస్ సాహిత్యం, ర‌త్న‌వేలు ఫోటోగ్రఫీ సినిమాని ఎక్క‌డికో తీసుకెళ్ళాయి. మ‌రి ఈ కొత్త ట్రైల‌ర్‌ను మీరూ చూడండి.

- Advertisement -