కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన రంగారెడ్డి ప్రజా ప్రతినిధులు..

165
ktr
- Advertisement -

హైదరాబాద్‌లో అమెజాన్ సంస్థ రూ.20,761 కోట్ల భారీ పెట్టుబడి ప్రకటించడం పట్ల మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రంగారెడ్డి జిల్లా, ప్రజా ప్రతినిధులు. ఇంత భారీ ఎత్తున రంగారెడ్డి జిల్లా కి పెట్టుబడి తరలిరావడం పట్ల స్థానిక యువతకు అనేక ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాతో పాటు, తెలంగాణ యువత తరపున మంత్రి కే తారకరామారావుకి ధన్యవాదాలు తెలిపారు. అమెజాన్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ మరియు డిఫెన్స్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో అనేక కంపెనీలు రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుండటం వలన రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లోనే రంగారెడ్డి జిల్లా ముఖచిత్రం మారిపోతుందని ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.

మంత్రిని కలిసిన వారిలో..

  1. మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  2. పువ్వాడ అజయ్
  3. కొప్పుల ఈశ్వర్
  4. ఎంపీ రంజిత్ రెడ్డి
  5. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
    6.  ఎమ్మెల్యే సుమన్
  6. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
  7. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
  8. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
  9. రంగారెడ్డి జిల్లా జెడ్పి చైర్మన్ తీగల అనిత
  10. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కార్తిక్ రెడ్డి ఉన్నారు.
- Advertisement -