టీఆర్ఎస్ లోకి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు..

518
kyama mallesh
- Advertisement -

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు క్యామ మ‌ల్లేష్ యాద‌వ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈసంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వానికి, రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ ప‌ద‌వికి కూడా రాజీనామా చేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఈరోజు ఇబ్ర‌హింప‌ట్నంలో జ‌రిగే ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ లో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

trs

కాంగ్రెస్ పార్టీ యాద‌వ సామాజిక వ‌ర్గానికి అన్యాయం చేసింద‌ని తెలిపారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ టికెట్లను అమ్ముకున్నారని ఆరోప‌ణ‌లు చేశారు. ఉత్త‌మ్ ఏం చేశార‌ని వాళ్ల‌కు రెండు టికెట్లు ఇచ్చార‌న్నారు. 35సంవ‌త్స‌రాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం ప‌నిచేస్తుంటే త‌న‌కు గౌర‌వం లేద‌న్నారు. హుజుర్‌నగర్, కోదాడలో ఉత్తమ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం యాదవుల సంక్షేమానికి కృషి చేసిందన్నారు క్యామ మ‌ల్లేష్.

- Advertisement -