మోసం, చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్‌కి రాంచీ కోర్టు షాక్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అమీషా పటేల్, ఆమె బిజినెస్ పార్ట్నర్ కృనాల్‌పై రాంచీ సివిల్ కోర్టు వారెంట్ జారీ చేసింది. అమీషా పటేల్ పై సీఆర్పీసీ (CRPC) సెక్షన్ 420, 120 కింద కేసు నమోదు చేశారు. ఐతే, సమన్లు జారీ చేసినా అమీషా పటేల్ కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ 15న జరగనుంది. ఈ విచారణకు అయినా అమీషా పటేల్ హాజరు అవుతుందో లేదో చూడాలి. నిజానికి చాలా కాలంగా అమీషా పటేల్ తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులతో చాలా బాధ పడుతుంది.
ఆ మధ్య అమీషా పటేల్ సినీ నిర్మాణంలోకి అడుగు పెట్టింది. అయితే, ఆ నిర్మాణంలో జరిగిన అవకతవకలు కారణంగా ఆమెకు నష్టాలు వచ్చాయి. దీనికితోడు, అమీషా పటేల్ కుటుంబ సభ్యులలో కొందరు ఆమె ఆస్తులను దోచుకున్నారు అని, అలాగే అమీషా పటేల్ కి ఉన్న వ్యక్తిగత వ్యసనాలు కారణంగా ఆమె తన ఆస్తులను కోల్పోయింది అని టాక్. పాపం.. సినిమా హీరోయిన్ అనగానే కోట్ల సంపాదన అనుకుంటారు. సినిమా వాళ్ల మీద ఎప్పుడూ అభిమానుల అభిమానంతో పాటు ప్రశంసల జల్లు కురుస్తూ ఉంటుందని భావిస్తారు. కానీ కాలం కలిసిరాకపోతే ఎన్నో అవమానాలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
హీరోయిన్ అమీషా పటేల్ పరిస్థితే ఇందుకు చక్కటి ఉదాహరణ. స్టార్ హీరోల సరసన నటించి.. పెళ్లి కూడా చేసుకోకుండా పూర్తి జీవితాన్ని సినీ ఇండస్ట్రీకే అంకితం చేసిన అమీషా పటేల్, చివరకు ఇలా అప్పుల బాధతో నలిగిపోతుండటం బాధాకరం. ఫైనల్ గా ఈ చెక్ బౌన్స్ కేసు ఎటు వైపుకు దారి తీస్తుందో చూడాలి. అన్నట్టు తన అప్పులు తీర్చుకుకోవడానికి మళ్లీ మొహానికి రంగు వేసుకోవడానికి అమీషా తెగ ఉబలాట పడుతోంది అండోయ్.
ఇవి కూడా చదవండి..