నిన్నటివరకూ కయ్యానికి కాలు దువ్విన ఆ ఎక్స్ లవర్స్… ఉన్నట్లుండి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. అయితే ఇదంతా పబ్లిసిటీ స్ట్రాటజీలో భాగమేనట. బ్రేక్ అప్ చెప్పేసుకున్న తరువాత ణ్ బీర్, కత్రినా కొంతకాలం వరకూ ఒకరి పేరు ఇంకొకరు తలుచుకునేందుకు ఇష్టపడలేదు.అయితే వీరిద్దరిని జగ్గా జాసూస్ కోసం అతికష్టం మీద ఇరువురినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చాడు దర్శకుడు అనురాగ్ బసు. ఎట్టకేలకు షూటింగ్ పూర్తైన ఈ సినిమా త్వరలోనే జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘జగ్గా జాసూస్’ ప్రమోషన్ లో భాగంగా ముంబైలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే,ఈ సమయంలో హీరో రణబీర్ ప్రవర్తించిన తీరుతో అంతా బిక్కపోయారు. అందరూ చూస్తుండగానే అనురాగ్కి గాఢంగా ముద్దు ఇచ్చేశాడు. పక్కన హీరోయిన్ కత్రినా కైఫ్ ఉండగానే.. రణ్ బీర్ ఇలా చేయడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే వాళ్లిద్దరు లిప్ లాక్ లో మునిగి తేలారా? లేక? అలా నటించారా అన్నది వారికీ, కత్రినాకే తెలియాలి. ఎందుకంటే కెమెరాల కంట పడకుండా ఆ పని చేశారు కాబట్టి. ఐదేళ్లక్రితం వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చి ‘బర్ఫీ’ ప్రమోషన్ లోనూ రణ్ బీర్ ఇలాగే అనుగార్ ను ముద్దు పెట్టుకున్నాడు.