సంజయ్ గా మారిన రణబీర్..

145
Ranbir Kapoor in his Sanjay Dutt avatar makes him look totally unrecognisable

రణబీర్ కపూర్ మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరో. బాలీవుడ్‌లో సెక్సీ హీరోగా స్టార్ ఇమేజ్ సోంతం చేసుకున్నాడు .అయితే ఈ చాక్లెట్ బాయ్ తో సినియర్ హీరో జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాజ్ కుమార్ ఇరాని. ఆ బాలీవుడ్ హీరో మరెవరో కాదు సంజయ్ దత్.మరి సంజయ్ దత్, రణబీర్ కపూర్ లను పక్క పక్కనబెట్టి చూస్తే అంతగా పోలికలేమీ ఉండవు. ఒక్క హైట్ విషయంలో మాత్రమే ఇద్దరూ మ్యాచ్ అవుతారేమో. సంజూ చాలా రఫ్ గా ఉంటాడు. రణబీర్ మాత్రం చాక్లెట్ బాయ్ లాగా ఉంటాడు.

ranbir-kapoor-rsquo-s-look-for-the-sanjay-dutt-biopic-is-finally-here980-1492011465_980x457

మరి సంజయ్ దత్ పాత్ర చేయడానికి రణబీర్ ఏమాత్రం సరిపోతాడో అని అని చాలామంది సందేహించారు. కానీ ఆ సందేహాలన్నీ ఇప్పుడు రణబీర్ లుక్ చూశాక పటాపంచలైపోతాయనడంలో సందేహం లేదు. రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంజయ్ దత్ బయోపిక్ లో రణబీర్ లుక్ కు సంబంధించిన కొన్ని లీక్డ్ పిక్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.

అవతారం మొత్తం మార్చేసి సంజయ్ దత్ లాగా మారిపోయినట్లే ఉన్నాడు రణబీర్ ఇందులో. నెరిసిన జుట్టుతో తెల్ల గడ్డం.. మీసం మొత్తంగా బాడీ లాంగ్వేజ్ కూడా మార్చేసి సంజయ్ దత్ కు డిట్టోలా అనిపిస్తున్నాడు రణబీర్. ఈ లుక్స్ చూశాక ఒక్కసారిగా సినిమా మీద క్యూరియాసిటీ పెరిగిపోయేలా ఉంది పరిస్థితి. ఈ చిత్రంలో సంజయ్ దత్ తల్లి నర్గీస్ పాత్రను ఒకప్పటి అందాల హీరోయిన్ మనీషా కొయిరాలా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తి చేసుకుందట. ఐతే సినిమాను వచ్చే ఏడాదే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు హిరాని. సంజయ్ దత్ హిరానికి అత్యంత సన్నిహితుడన్న సంగతి తెలిసిందే. హిరాని అతడితో మున్నాభాయ్ ఎంబీబీఎస్.. మున్నాభాయ్ లగేరహో లాంటి అద్భుతమైన సినిమాలు తీశాడు. సంజయ్ దత్ జీవితాన్ని దగ్గర్నుంచి చూసిన హిరాని.. తెరమీద మిత్రుడి లైఫ్ స్టోరీని ఎలా తీయబోతున్నాడు అని బాలీవుడ్ వర్గలు ఎదురు చూస్తున్నాయి.