‘దాదా సాహెబ్‌’… ఇది దురదృష్టకరమే

18
- Advertisement -

బాలీవుడ్ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌‌కు ప్రతిష్టాత్మకమైన ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’‌లో 2022 ఏడాదికి గానూ ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది. సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండి రణ్‌బీర్ ఫెస్టివల్ వేడుకలకు రాకపోవటంతో ఆయన సతీమణి ఆలియా భట్‌ అవార్డు అందుకున్నారు. ఐతే, ఇప్పుడు ఈ అవార్డు పై విమర్శలు వినిపిస్తున్నాయి. రణబీర్ కపూర్ కు అవార్డు పొందే అర్హత లేదని, కారణం రణ్‌బీర్‌ కపూర్‌‌ కంటే.. 2022 కి గానూ ఉత్తమైన నటనను ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్, కాంతారా చిత్రంలో రిషబ్ శెట్టి ప్రదర్శించారు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అయినా, రణ్‌బీర్‌ కే అవార్డు వెళ్లడం కొసమెరుపు. కేవలం బాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికే అవార్డులు ఇస్తున్నారని, తాజాగా ఈ ఉదంతం దీన్ని నిరూపించింది అని, ఈ అవార్డు ప్రధానం చూసి కచ్చితంగా దాదాసాహెబ్ మనసు కూడా క్షోభించి ఉంటుందని హిందీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డు పై ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరం.

ఇక సోమవారం రాత్రి ముంబయిలో జరిగిన ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును సొంతం చేసుకుంది. అలాగే మిగిలిన అవార్డుల లిస్ట్ ను గమనిస్తే.. ఈ విధంగా ఉంది జాబితా.

ఉత్తమ చిత్రం: (ది కశ్మీర్‌ ఫైల్స్‌)

ఉత్తమ నటుడు‌: రణ్‌బీర్‌ కపూర్‌ (బ్రహ్మాస్త్ర-1)

ఉత్తమ నటి: అలియా భట్‌ (గంగూబాయి)

మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌: రిషబ్‌శెట్టి (కాంతారా)

ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గా ఆర్‌ఆర్‌ఆర్‌.

ఇవి కూడా చదవండి..

- Advertisement -