రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా కలిసి నటిస్తున్న జగ్గా జాసూస్ సినిమా విడుదలకి రెడీ అయింది. అనురాగ్ బసు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎన్నో అవాంతరాలని అధిగమించి ఎట్టకేలకి జులై 14న ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
ఈ జంటని స్క్రీన్‌పై చూడటం కోసం చాలామంది బాలీవుడ్ ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, ‘జగ్గా జాసూస్’ తర్వాత మళ్లీ ఈ కలిసి నటించే అవకాశాలు లేవు కనుక. ఎందుకంటే ఇక రణ్‌బీర్ తో కలిసి నటించనని స్వయంగా కత్రినానే చెప్పేసింది.
ఇక ఇదిలాఉంటే…బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ‘జగ్గా జాసూస్’ సినిమా ప్రచారం కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు . కత్రినాకైఫ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రణ్‌బీర్ హీరో గా నటించడమే కాకుండా కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు.
అయితే ఈ సినిమా అనేక ఆటంకాలతో విడుదల విషయంలో వాయిదా పడుతోంది. ఎలాగైనా ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారు. డేట్ ను ప్రకటించి, ప్రచారంలో నిమగ్నమై ఉన్నాడు రణ్‌బీర్.
ఈ సందర్భంగా తమ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను చెబుతున్నాడు ఈ హీరో. సినిమాలో ఒక పాటను వైవిధ్యభరితంగా చిత్రీకరించామని.. ఆ పాటలో తను, కత్రినాలు బట్టల్లేకుండా బుట్టలు అడ్డుగా పెట్టుకుని ఉంటామని, పాట ఆసాంతం అలాగే ఉంటామని చెప్పాడు.
ఈ పాటకు ముందు సీన్ ను చెబుతూ.. ఒక పొలం వద్ద మంటల్లో తమ బట్టలు కాలిపోతాయని.. దీంతో అక్కడ బుట్టలు కనిపిస్తే వాటిని అడ్డం పెట్టుకుంటామని, అప్పుడు పాట వస్తుందని సీక్వెన్స్ ను వివరించాడు ఈ హీరో. మాజీ ప్రేమికులు అయిన కత్రినా, రణ్ బీర్ లు ఈ సినిమాలో జంటగా నటించారు. ప్రచార కార్యక్రమాల్లో కత్రినా కూడా అడపాదడపా పాల్గొంటోంది.