‘వెంకీమామ’తో భళ్లాలదేవుడు..!

235
Rana
- Advertisement -

వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘వెంకీమామ’ ఈ సినిమా దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో నిర్మితమవుతోంది. కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. సురేశ్ ప్రొడక్షన్స్ .. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో శ్రియ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు హిరోయిన్లుగా నటిస్తున్నారు.

వెంకటేశ్ సరసన శ్రియ .. చైతూ జోడీగా రకుల్ నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్‌తో పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తిగా ముగియ‌డంతో ఈ ప్రాజెక్ట్‌ని వీలైనంత త్వ‌ర‌గా సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని మేకర్స్ భావిస్తున్నార‌ట‌.

Rana

ఇక అసలు విషయానికొస్తే.. బాహుబ‌లి సినిమాతో సెన్సేష‌న‌ల్ స్టార్‌గా మారిన హీరో రానా దగ్గుబాటి తెలుగు, త‌మిళంతో పాలు ప‌లు భాష‌ల‌లోను సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం రానా ‘వెంకీమామ’లో గెస్ట్ అప్పీయ‌రెన్స్ ఇవ్వ‌నున్నాడ‌ని అంటున్నారు. ఎప్ప‌టి నుండో వెంక‌టేష్‌తో న‌టించాల‌ని రానా భావిస్తుండ‌గా, ఈ సినిమాతో రానా కోరిక తీరుతుంద‌ని చెప్పుకొస్తున్నారు. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

- Advertisement -