దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో..

268
- Advertisement -

వెంకటేశ్,రానా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చి నటనలో తమకంటూ ఒక స్టైల్ ను క్రియేట్ చేసుకున్నారు.వెంకటేష్‌ అగ్రకథానాయకులలో ఒకరుగా తిరుగులేని స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన రానా, విభిన్నమైన పాత్రలను చేస్తూ, నటుడిగా తన సత్తా చాటుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రానా సోదరుడు ‘అభిరామ్’ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని సిని వర్గాల బోగట్ట.

Rana's brother Abhiram debut as Hero

అయితే నటన దిశగా అభిరామ్ రానున్నట్టు కొంతకాలం క్రితమే వార్తలు షికారు చేశాయి .. అవి ఇప్పుడు నిజమవుతున్నాయి. అభిరామ్ ను హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శంకర్ నాథ్ దుర్గ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ఆయన మోహన్ బాబు .. శర్వానంద్ కాంబినేషన్లో ‘రాజు – మహారాజు’ సినిమా చేశాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -