హీరో రానా వదిలిన ‘విజయ రాఘవన్’ ట్రైలర్..

133

తమిళ హీరో విజయ్‌ ఆంటోనీ కథనాయకుడిగా ‘కోడియిల్ ఒరువన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ”విజయ రాఘవన్” పేరుతో టాలీవుడ్‌లో విడుదల చేయనున్నారు. ఇది వరకే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ – టీజర్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను హీరో రానా దగ్గుబాటి విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు.

రౌడీ గ్యాంగులు .. రాజకీయనాయకులు .. ఆధిపత్య పోరు .. మధ్యలో నలిగిపోయే సామాన్య ప్రజలు .. వాళ్లకి మంచి చేయబోయే ప్రయత్నంలో హీరో ఎదుర్కునే పరిణామాలే ఈ సినిమా కథ అనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. కాకపోతే విజయ్ ఆంటోనికి డబ్బింగ్ వాయిస్ సెట్ కాలేదని అనిపిస్తోంది. రెగ్యులర్ గా విశాల్ కి చెప్పించే వారితో విజయ్ ఆంటోనికి చెప్పించారు గానీ నప్పలేదు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విజయ్ ఆంటోని సరసన నాయికగా ‘ఆత్మిక’ అలరించనుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ‘గరుడ’ రామ్ నటించాడు.

Vijaya Raghavan - Telugu Trailer | Vijay Antony | Aathmika | Ananda Krishnan | Nivas K Prasanna