బందిపోటుగా భల్లాలదేవ..

248
Rana to play Tiger Nageswara Rao?
- Advertisement -

డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుతెచ్చుకున్న హీరో రానా. ఇప్పటికే వరుసగా ఆరు సినిమాలకు కమిట్ అయిన రానా తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 70వ దశకంలో తన దొంగాతనలతో తెలుగు రాష్ట్రాన్ని వణికించిన గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు బయోపిక్ లో నటించేందుకు ఒప్పుకున్నాడు.

స్టువర్టుపురం గ్రామం ఎరుకల కులానికి చెందిన నాగేశ్వర్ రావు అప్పట్లో ఇళ్ళు – దుకాణాలు – సంస్థలు చాకచక్యంగా లూటీ చేయటంలో ప్రసిద్ధి గాంచాడు. తిరుపతి – వైజాగ్ – కాళహస్తి – హైదరాబాద్ వంటి పట్టణాల్లో నాగేశ్వర్‌ రావుపై లెక్కలేనన్ని కేసులు ఉన్నాయి. 1987 లో జరిగిన ఒక పోలీస్ ఎన్ కౌంటర్ లో టైగర్ నాగేశ్వర్ రావు మరణించాడు. ఇప్పుడు ఈ కథతోనే రానా హీరోగా సినిమా రాబోతోందని టాక్.

కిట్టు గాడు జాగ్రత్త సినిమా తీసిన వంశీ కృష్ణ దర్శకత్వంలో అనిల్ సుంకర దీన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి. కథ చాలా బాగా వచ్చిందని. ఎగ్జైట్ చేసే అంశాలు చాలా ఉన్నందునే ఇది చేయాలని రానా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -