రానా దగ్గుబాటి వైవిధ్యభరితమైన కథా కథనాలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ‘ఘాజీ’ .. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన ‘1945’ .. ‘హాథీ మేరా సాథీ’ సినిమాలను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా డిఫరెంట్ కంటెంట్ తో కూడుకున్నవే. ఈ సినిమాలు కాకుండా ఆయన ఒ మలయాళ మూవీ చేస్తున్నాడు.
రానా టాలీవుడ్‌కే పరిమితం కాకుండా బహుభాషా నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తాజాగా మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు..మార్తాండ వర్మ : ది కింగ్ ఆఫ్ ట్రాన్స్ కోర్ అనే పీరియడ్ డ్రామా చిత్రంలో కేరళ ట్రావెన్కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ్ వర్మ పాత్రను పోషిస్తున్నాడు. కె మధు దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి రాబిన్ తిరుమల కథ అందించారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో మలయాళంలోనూ రానా బిజీ అవుతాడేమో చూడాలి మరి.