బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు దగ్గుపాటి రానా. ఈ చిత్రంలో బల్లాలదేవ పాత్రలో నటించి ప్రముఖుల నుంచి ప్రశంసలందుకున్నాడు. గతంలో ‘ఘాజీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి తన నటతో మరోసారి విజయాన్ని అందుకున్నాడు. విభిన్నమైన కథంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల జాతీయ అవార్డును సైతం అందుకుంది.
ప్రస్తుతం రానా రొటిన్‌కు భిన్నంగా కథల ఎంపికలో అచితూచి అడుగులేస్తున్నాడు. ఇదే కాక చేతినిండ సినిమాలతో క్రేజీ ప్రాజెక్టులను అందుకుంటున్నాడు. ‘1945’ అనే చారిత్రాత్మక నేపధ్యంలో ఉన్నసినిమా చేస్తున్నప్పటికి మారో సినిమాను ఒప్పుకున్నాడు రానా. పీరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కేరళ ట్రావెన్కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ్ వర్మ పాత్ర కనిపించనున్నాడు.
ఈ సినిమాలే కాక గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘హిరణ్యకశ్యప’ అనే సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంచితే ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో హిట్‌ను అందించిన తేజ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అయ్యాడు. ఈ సినిమాలో ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది