రానా ‘హాథీ మేరా సాథీ’ టీజర్

520
Haathi_Mere_Saathi_
- Advertisement -

బాహుబలి సినిమాతో ప్రభాస్ కు ఏ రేంజ్ లో గుర్తింపు వచ్చిందే ప్రతినాయకుడి పాత్రలో చేసిన రానాకు కూడా అదే స్ధాయిలో గుర్తింపు వచ్చింది. ఇక రానా తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇక రానా ప్రస్తుతం హిందీలో హాధీ మేరా సాధీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను హిందీ తో పాటు కన్నడ, తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేశారు. ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అడవిలో ఏనుగులను మచ్చిక చేసుకోని వాటితో సావాసం చేసే అడవి తెగకి చెందిన వ్యక్తిగా రానా లుక్ ఆకట్టుకునేలా ఉంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రానా సరసన జోయా హుస్సేన్, శ్రియ నటిస్తున్నారు. విష్ణు విశాల్, సామ్రాట్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈమూవీతో పాటు రానా తెలుగులో విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్నారు.

- Advertisement -