1945 మూవీ…నిర్మాత వర్సెస్ రానా..!

332
rana

బాహుబలి తర్వాత బిజీ ఆర్టిస్టుగా మారిపోయాడు హీరో రానా. బాలీవుడ్‌తో టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్నారు రానా. ప్రస్తుతం రానా హీరోగా పీరియాడిక్ డ్రామా 1945తో పాటు హాథీమేరి సాథీ సినిమాను చేస్తున్నాడు.

అయితే రానాకు 1945 సినిమా నిర్మాత ఎస్‌ఎన్‌ రాజరాజన్‌కు పేమెంట్ విషయంలో గ్యాప్ రావడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లేనని అంతా భావించారు. అయితే దీపావళి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన నిర్మాత రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశాడు. జనవరి 24న సినిమా విడుదలవుతుందన తెలిపారు.

rana

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా స్పందించిన రానా…1945 సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదన్నారు. నిర్మాత రెమ్యునరేషన్ విషయంలో మోసం చేశాడని సంవత్సర కాలంగా తాను అసలు చిత్రయూనిట్‌ను కలవలేదన్నారు. మరింత మందిని మోసం చేసి డబ్బు చేసుకునేందుకు నిర్మాత ఆడుతున్న నాటకం. ఇలాంటి వారిని నమ్మకండి అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దానిని డిలీట్ చేశాడు.

రానా ట్వీట్‌కు ఘాటుగా స్పందించారు రాజరాజన్‌. పూర్తికాని సినిమాను ఎవరూ రిలీజ్‌ చేయరు…సినిమా షూటింగ్‌ పూర్తయ్యిందో లేదో నిర్ణయించాల్సింది దర్శకుడు…దాదాపు 60 రోజుల పాటు షూటింగ్ చేశాం. కోట్ల రూపాయలు ఖర్చు చేశాం అంటూ రిప్లై ఇచ్చాడు. సినిమా పూర్తైందో లేదో ప్రేక్షకులు నిర్ణయిస్తారని తెలిపారు. మరి నిర్మాత కౌంటర్‌కు రానా ఎలా స్పందిస్తాడో వేచిచూడాలి.