ఒకే రోజు రెండు విశేషాలు….

86

నాగచైతన్య జీవితంలో జనవరి 29 ఎప్పటికీ గుర్తు పెట్టుకునే రోజుగా మారబోతుంది. ఎందుకంటే… ఆ రోజు రెండు ముహూర్తాలు కుదిరాయి. ఒకటి సమంతతో చైతు నిశ్చితార్థం.. రెండు చైతూ హీరోగా దగ్గుబాటి రానా నిర్మించనున్న చిత్రం ప్రారంభోత్సవం. దీనిపై అఫీషియల్ న్యూస్ రాకపోయినా.. ఫిల్మ్ వర్గాలు మ్యాటర్ కన్ఫామ్ చేస్తున్నాయి. అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ బ్యానర్ లో మాత్రమే చైతు నటించాడు. దగ్గుబాటి సురేష్ ప్రొడక్షన్ లో చైతు హీరోగా సినిమా వస్తుందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి.

Rana Daggubati's big plan

అయితే ఎట్టకేలకు అందుకు మూహూర్తం కుదిరింది.ఈ చిత్రంతో కృష్ణ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు. నిజానికి, కృష్ణ దర్శకత్వంలో చైతూ హీరోగా మేనమామ సురేశ్‌బాబు ఓ చిత్రం నిర్మించాలనుకున్నారు. ఇప్పుడా చిత్రాన్నే రానా నిర్మించాలను కుంటున్నాడు. మరి.. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లోనే నిర్మిస్తారా? రానా తన బ్యానర్‌కి వేరే పేరు పెట్టుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.