కన్నీళ్లు పెట్టిస్తున్నా చిరు….

85
Heart Touching Song in Khaidi No 150

చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెం.150 సినిమా రైతుల కష్టాల నేపధ్యంలో తెరకెక్కతున్న విషయం తెలిసిందే. రైతుల కష్టాలను కథానాయకుడు ఎలా తీర్చాడన్నదే ఈ సినిమా కథ. తాజాగా రైతుల కష్టాలను తెలియజేస్తూ రామ‌జోగ‌య్య శాస్త్రి రాయగా.. దేవిశ్రీ స్వరపరిచిన నీరు నీరు పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. రైతుల కన్నీటి వ్యధకు ఈ పాట అద్దం పడుతోంది. అప్‌లోడ్ చేసిన 19గంటల్లోనే 8లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయంటే ఈ పాట ఎంతలా హృదయాలను కదిలించిందో చెప్పొచ్చు.

Heart Touching Song in Khaidi No 150

నీరు నీరు అంటూ సాగే ఈ పాట‌లో రైతు బాధ‌ల్ని గుండెకి హ‌త్తుకునేలా ర‌చించాడు రామ‌జోగ‌య్య శాస్త్రి. ఆయ‌న పాట విన్న త‌ర్వాత ప్ర‌తీ రైతు గుండె క‌చ్చితంగా మూగ క‌న్నీరు కారుస్తుంది. అంత‌లా ఈ పాట‌లో మ్యాట‌ర్ ఉంది. ఈ రైతన్న పాటతో దేవి మరోసారి అందరిప్రశంసలు పొందుతున్నాడు. శంకర్ మహదేవన్ ఆలపించిన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. మొత్తానికి ఇన్నాళ్లూ మాస్ సినిమాగా ఉన్న ఖైదీ నెంబ‌ర్ 150.. ఈ పాటతో అంద‌రి హృద‌యాల్ని ట‌చ్ చేసిందనే చెప్పాలి.