‘బిగ్ బాస్’ షో లోకి రానా

197
RANA IN NTR BIGBOSS SHOW
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా నిర్వహిస్తున్న తెలుగు బిగ్ బాస్ షో ప్రస్తుతం మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది.. 14 మంది పార్టిసిపెంట్స్ తో ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మంలో ఇప్ప‌టికే ముగ్గురు నిష్క్ర‌మించ‌గా, రీసెంట్ గా దీక్షా హౌజ్ మేట్స్ తో జాయిన్ అయింది. అయితే ఈ రోజు కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ తో పాటు ఓ స్పెషల్‌ గెస్ట్ కూడా రాబోతున్నారట..

స్పెషల్ గెస్ట్ అనగానే.. దీక్షా పంత్ లాగా ఇంకొకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వస్తున్నారేమో అనుకోకండి. ఈసారి రాబోయే గెస్ట్ పార్టిసిపెంట్ గా రావట్లేదు. జస్ట్ గెస్ట్ అప్పీయరెన్స్ కోసమే. ఆ అతిథి మరెవరో కాదు.. రానా దగ్గుబాటి. ‘బిగ్ బాస్’ షోకు రాబోతున్న ఫస్ట్ బిగ్ సెలబ్రెటీ అతనే కావడం విశేషం.ఈ ప్రోగ్రాం కోసం రానా ఇప్ప‌టికే పూణే కూడా చేరుకున్న‌ట్టు తెలుస్తుంది. త‌న తాజా చిత్రం నేనే రాజు నేనే మంత్రి చిత్ర ప్ర‌మోష‌న్ లో భాగంగానే రానా బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేస్తున్న‌ట్టు టాక్. రానా న‌టించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం ఆగ‌స్ట్ 11న విడుద‌ల కానుండ‌గా ఇందులో జోగేంద్ర అనే పొలిటిక‌ల్ లీడ‌ర్ గా క‌నిపించ‌నున్నాడు.

ముంబయి ఎయిర్ పోర్ట్ లో తెల్ల లుంగీ, తెల్ల చొక్కా, కళ్ల జోడు ధరించి స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్న రానా ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. తమ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నపుడు ‘బిగ్ బాస్’ షోకు వచ్చి వాటిని ప్రమోట్ చేసుకోవడం.. పనిలో పనిగా ‘బిగ్ బాస్’కు కూడా ఆకర్షణ తీసుకురావడం హిందీలో చూసే ఉంటారు. ఈ ట్రెండు తెలుగులో ఇప్పుడే మొదలవుతోంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో రానా ఏ గెటప్ లో అయితే ఉన్నాడో, అదే గెటప్ లో ఎయిర్ పోర్టులో కనిపించాడు.

- Advertisement -