ఈ పెద్దాయనకు చుక్కలు చూపించింది !

203
Jab Harry Met Sejal| Pahlaj Nihalani cornered by reporter
Jab Harry Met Sejal| Pahlaj Nihalani cornered by reporter
- Advertisement -

నవాజుద్దీన్‌ సిద్ధిఖీ హీరోగా కిరణ్‌ ష్రఫ్‌ ‘బాబుమోషాయ్‌ బందూక్‌బాజ్‌’ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. పహ్లాజ్‌ నిహలానీ నేతృత్వంలోని సీబీఎఫ్‌సీ.. ఈ సినిమాకు ఏకంగా 48 కత్తెర్లు వేసింది అలాగే గతంలో వచ్చిన ఉడ్తా పంజాబ్‌ సినిమాకు కూడా ఇదేవిధంగా కట్లు చెప్పి బాలీవుడ్‌ విమర్శలకు గురయ్యాడు నిహలానీ.. ఇలా సినిమావాళ్లు నిహలానీని చూసి వణికిపోతుంటే.. ఈ సెన్సార్‌ పెద్దాయన మాత్రం ఓ లేడీ రిపోర్టర్‌ చూస్తే వణికిపోయాడు. అంతేకాదు ఎ`మిర్ర‌ర్ నౌ` రిపోర్ట‌ర్ హిమాంశు చౌద‌రిపై సీబీఎఫ్‌సీ చైర్మ‌న్ ప‌హ్లాజ్ నిహలానీ ముంబై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

`జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్‌` సినిమాలో ఇంటర్‌కోర్స్‌ అనే పదంపై అభ్యంతరం వ్యక్తం చేసిన నిహలానీ.. ఆ పదాన్ని తొలగించాలని కోరాడు. దీనిపై `మిర్ర‌ర్ నౌ` ప్ర‌తినిధులు పహ్లాజ్‌ నిహలానీని వివరణ కోరారు. ఆయన `జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్‌` సినిమా విష‌యంలో `ఇంట‌ర్‌కోర్స్‌` అనే ప‌దాన్ని తొల‌గించ‌కుండా ఉంచ‌డానికి ప్ర‌జ‌ల అభిప్రాయం కోరమన్నాడు. వారు అదేవిధంగా ప్రజల అభిప్రాయాన్ని సేకరించి మరోసారి నిహలానీని వివరణ కోరారు. ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ త‌న‌ను ప్ర‌శ్న‌ల‌తో వేధిస్తూ, వ్య‌క్తిగ‌త జీవితాన్ని టీవీలో ప్ర‌సారం చేస్తూ స్వేచ్ఛ‌కు భంగం క‌లిగిస్తున్నారని ఆరోపిస్తూ, ఇవాళ కూడా హిమాంశు త‌న కార్యాల‌యంలో ఇష్టం వ‌చ్చిన‌ట్టు ప్ర‌శ్న‌లు అడిగి వేధించింద‌ని నిహలానీ ఫిర్యాదులో పేర్కొన్నారు. తను సమాధానం చెప్పటానికి నిరాకరిస్తున్నా, నన్ను పాలో కావద్దమ్మా అని మర్యాదగా చెప్పినా సరే, అడుగడుగునా అడ్డుతగులుతూ అదే ప్రశ్న పదేపదే అడుగుతూ నిహలానీకి చుక్కలు చూపించింది ఆ రిపోర్టర్‌.

అంతేకాదు అప్పుడు హిమాంశు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు నిహలానీ ఎలాంటి స‌మాధానం చెప్ప‌కుండా వెళ్లిపోతుంటే, ఆమె ఆయ‌న‌ను లిఫ్ట్‌లో వెంట‌ప‌డుతూ ప్ర‌శ్నించారు. ఆ వీడియోను ఎలాంటి ఎడిటింగ్ లేకుండా మిర్ర‌ర్ నౌ ప్ర‌సారం చేసింది. దీనిపై మిర్ర‌ర్ నౌ ఎడిట‌ర్ ఫాయే డిసౌజా స్పందిస్తూ – ప‌హ్లాజ్ నిహలానీ రిపోర్ట‌ర్ చెయ్యి ప‌ట్టుకుని లాగార‌ని, తిరిగి ఆమెపైనే ఫిర్యాదు చేయ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని అన్నారు. ఈ వీడియోను ఇక్క‌డ చూడొచ్చు.

- Advertisement -