‘అరణ్య’పై రానా ఆసక్తికర కామెంట్స్..!

245
Rana Daggubati
- Advertisement -

రానా దగ్గుబాటి ప్రస్తుతం ‘విరాట పర్వం’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నక్సల్ బ్యాక్ గ్రౌండ్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాను వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్‌గా నటిస్తుండగా, సాయి పల్లవి జానపద గాయని పాత్రలో నటిస్తోంది. కాగా రానా మరో సినిమా కూడా చేస్తున్నాడు. అదే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘హాథీ మేరే సాథీ’. తెలుగులో ఈ చిత్రం అరణ్య పేరుతో విదులకానుంది.

అయితే అరణ్యలో రానా చేసిన పాత్ర గురించి అలాగే లొకేషన్స్ లో ఏనుగు వలన పడిన ఇబ్బందుల గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. సినిమా కోసం బాహుబలి కంటే ఎక్కువ కష్టపడ్డాను అంటూ ముఖ్యంగా ఏనుగు తొండం మోయలేకపోయానని అన్నాడు. అరణ్య సినిమాలో రానా బందేవ్ అనే పాత్రలో ఏనుగు సంరక్షకుడిగా నటించాడు. అయితే ఏనుగు తొండం తన భుజంపై వేసినప్పుడు సుమారు 160-170కేజీల బరువు ఉండేదని రానా తెలిపాడు. అప్పుడు చాలా ఇబ్బంది పడినట్లు చెప్పాడు. ఈ సినిమా చాలా కొత్త అనుభూతిని ఇచ్చిందని తప్పకుండా అందరికి నచ్చుతుందని కూడా రానా చెప్పుకొచ్చాడు.

- Advertisement -