రాగల మూడు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు..

325
Heavy rain
- Advertisement -

మధ్యమహారాష్ట్ర మరియు మరఠ్వాడలోని మరికొన్ని ప్రాంతాలు, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలు, విదర్భలో కొన్ని ప్రాంతాలు, చత్తీస్ గఢ్‌లో మరికొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతంలో మిగిలిన ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఒరిస్సా మరియు పశ్చిమబెంగాల్‌లో చాలా ప్రాంతాలు, సిక్కింలోని మొత్తం ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు విస్తరించాయి.

మధ్య అరేబియా సముద్రంలో మరికొన్ని ప్రాంతాలు, మహారాష్ట్రలో మిగిలిన ప్రాంతాలు(ముంబైతో సహా), ఒరిస్సా, పశ్చిమబెంగాల్, చత్తీస్ గఢ్‌లో మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ గుజరాత్‌లో కొన్ని ప్రాంతాలు, దక్షిణ మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ మరియు బీహార్ ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు రాగల 48 గంటలలో విస్తరించే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు దానిని ఆనుకొని ఉన్న కోస్తా ఒరిస్సా మరియు దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది.

తూర్పు- పశ్చిమ shear zone 17.0°N Lattitude వెంబడి 3.1 km ఎత్తు వద్ద ద్వీపకల్ప భారతదేశం మీదుగా 7.6 km ఎత్తు వరకు ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్ళే కొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 1.5 km ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం:

ఈ రోజు (12-06-2020) ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.రేపు (13-06-2020) ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి (14-06-2020) ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :

ఈ రోజు (12-06-2020) ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు (13-06-2020) ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి (14-06-2020) దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ :

ఈ రోజు (12-06-2020) ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మరియు కడప, కర్నూలు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.రేపు (13-06-2020) ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి (14-06-2020) రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

- Advertisement -